Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ రాజీనామా..
Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ సీఎం పదవికి పుష్కర్ సింగ్ ధామీ రాజీనామా చేశారు.;
Pushkar Singh Dhami (tv5news.in)
Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ సీఎం పదవికి పుష్కర్ సింగ్ ధామీ రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్ గుర్మీత్ సింగ్‌కు సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ధామీని గవర్నర్ కోరారు. ఉత్తరాఖండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగమన్నారని పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌లో 47 సీట్లు నెగ్గి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే సీఎం పుష్కర్ సింగ్ ధామీ మాత్రం ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తదుపరి సీఎం ఎవరన్నది ఆసక్తిగా మారింది. తిరిగి పుష్కర్‌నే ఎన్నుకుంటారా? లేదంటే కొత్త వ్యక్తిని తెరపైకి అధిష్ఠానం తెస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.