New Delhi : రాహుల్ గాంధీ అరెస్ట్.. ద్రౌపది ముర్ముకు విపక్షాల లేఖ..

New Delhi : సోనియా గాంధీపై ఈడీని ప్రయోగించడాన్ని నిరసిస్తూ.. రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు

Update: 2022-07-26 10:00 GMT

New Delhi : దేశవ్యాప్తంగా... ఆందోళనలు చేస్తోంది కాంగ్రెస్‌. సోనియా గాంధీపై ఈడీని ప్రయోగించడాన్ని నిరసిస్తూ.. రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. విజయ్‌చౌక్‌ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అంతకు ముందు పార్లమెంట్‌ నుంచి రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్‌ ఎంపీలు, నేతలు ర్యాలీగా వచ్చారు.

రాహుల్‌గాంధీ ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్ చేశారు. రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ ఎంపీలను వ్యాన్‌లో ఎక్కించి తరలించారు.

మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు లేఖ రాశాయి. విపక్ష నేతలపైకి ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉసిగొల్పుతున్నారంటూ ఆరోపించారు.

అటు పార్లమెంట్‌లో సైతం కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని, ఎంక్వైరీ సంస్థలతో దాడులు చేయిస్తున్నారంటూ ఉభయసభల్లోనూ నిరసన తెలిపారు.

Tags:    

Similar News