Rahul Gandhi : జోష్‌గా రాహుల్ 'భారత్ జోడో యాత్ర'.. ప్రజల నుంచి విశేష స్పందన..
Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎనిమిదో రోజు విజయవంతంగా ముగిసింది;
Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎనిమిదో రోజు విజయవంతంగా ముగిసింది. మలి దఫాలో భాగంగా సాయంత్రం నాలుగున్నర గంటలకు కొల్లాం నుంచి పాదయాత్ర చేపట్టిన ఆయన.. రాత్రి ఏడు గంటలకు పల్లిముక్కు జంక్షన్‌లో ముగించారు. రాత్రికి పల్లిముక్కులోని యూనిస్ ఇంజనీరింగ్ కాలేజీలోనే రాహుల్ బస చేస్తారు. ఎనిమిదో రోజు మొత్తం 25 కిలోమీటర్ల మేర రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారు.
రాహుల్‌గాంధీ పాదయాత్ర ఎనిమిదో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ఉదయం కేరళలోని శివగిరి మఠంలో స్వామిజీలతో సమావేశమయ్యారు. అనంతరం నవాబ్‌కులం జంక్షన్ నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర.. మధ్యాహ్నానికి కొల్లాంలో ప్రవేశించింది. చింతన్నూర్ వద్ద ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక మహిళలు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు.
యాత్ర సందర్భంగా పోలీసు బందోబస్తు భారీగా పెంచారు. అటు యువతీయువకులు మార్గమధ్యలో రాహుల్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పాదయాత్రలో భాగంగా స్కూల్ విద్యార్థులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులతో రాహుల్ ముచ్చటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నవాబ్‌కులం జంక్షన్ నుంచి పల్లిముక్కు జంక్షన్ వరకు దారి పొడువునా రాహుల్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది.
కేరళలో నాలుగో రోజు పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్‌గాంధీ.. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని ప్రధాని మోదీ, చైనాకు అప్పగించారంటూ ఆరోపించారు. ఏప్రిల్ 2020కి ముందున్న స్టేటస్‌కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని తెలిపారు. ఈ భూభాగాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో కేంద్రం సమాధానం చెప్పాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.