కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవి కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమేనని ఆయన అన్నారు. ఎన్నికలలో ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను అమిత్ షా ఖండించారు. ఓటర్ల జాబితాను శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టిందని, ఇది మొదటిసారి కాదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఓటమికి సాకులు వెతుక్కోవడానికి కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేశాన్ని విభజించే శక్తులకు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్‌కు, రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా తప్పుబట్టారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు రిజర్వేషన్లను ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.