Assembly Elections : టిఫిన్ సెంటర్లో దోసె వేసిన రాహుల్
విజయభేరి యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. షాయ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని వ్యాఖ్య;
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలోని జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా ఫుడ్ స్టాల్‌లో దోసెలు వేయడానికి ప్రయత్నించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తాను కాషాయ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానని, అందుకే తనపై 25-30 కేసులు ఉన్నాయని బీజేపీపై ఆరోపణలు చేశాడు. 'నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. నాపై 25-30 కేసులు ఉన్నాయి. నా లోక్‌సభ సభ్యత్వం కూడా సస్పెండ్ చేశారు. నాకు సంతోషంగా ఇచ్చిన నా ఇంటిని కూడా వారు తీసుకున్నారు, నాకు ఇల్లు అవసరం లేదు, భారతదేశం మొత్తం నా ఇల్లే" అని అన్నారు.
#WATCH | Congress MP Rahul Gandhi addresses the public in Telangana's Jagtial, says, "I fight against the BJP, there are get 25-30 cases against me. My Lok Sabha membership was also suspended. They also took my house which I gave happily. I don't need a house, the whole of India… pic.twitter.com/zOJXuDRYMm
— ANI (@ANI) October 20, 2023
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాల వెళ్తుండగా బస్టాప్ వద్ద కొద్దిసేపు ఆగి, టిఫిన్ బండి వద్ద దోసెలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అంతకుముందు అక్టోబర్ 19న జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జనాభా గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | Telangana | Congress MP Rahul Gandhi made dosas at a tiffin cart, as he briefly halted at the NAC bus stop while going to Jagtial as part of the Congress Vijayabheri Yatra.
— ANI (@ANI) October 20, 2023
(Video: Telangana Congress) pic.twitter.com/FIXGfvxfkh