Rahul Gandhi: పార్టీ శ్రేణులకు రాహుల్ దిశానిర్దేశం
బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచన;
త్వరలో జరగబోయే మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల్లో విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పని చేయాలని సూచించారని చెప్పాయి. త్వరలో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, మిత్ర పక్షాలతో కలిసి ఎన్నికల్లో పని చేయాలని రాహుల్‌గాంధీ, హస్తం పార్టీ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇటీవల సమీక్షించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హస్తం పార్టీలో సీనియర్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు విషయమై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, మూడు రాష్ట్రాల స్థానిక నేతలు, జమ్ముకశ్మీర్ నేతలు వ్యూహాలకు అనుగుణంగా ముందుకు సాగాలని రాహుల్‌గాంధీ సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర నేతలకు హై కమాండ్ దిశానిర్దేశం చేస్తోందని రాహుల్ అన్నారు. బహిరంగంగా ఒకరినొకరు తిట్టుకోవడం మానుకోవాలని ఆయన కోరారు పార్టీలో అన్ని సమస్యలపై చర్చిస్తామని త్వరలో జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా మంచి అవకాశమని, ఐక్యంగా ముందుకుసాగితే సానుకూల ఫలితాలు వస్తాయని రాహుల్ అన్నారు. పార్టీలో అంతర్గత పోరుపై ఖర్గే కూడా ఆందోళన వ్యక్తం చేశారు రాహుల్.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోడీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో నీట్ అంశం మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేశారని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా చదువుతుంటారని గుర్తు చేశారు.