Rahul Gandhi : సముద్రంలో దూకిన రాహుల్ గాంధీ..
Rahul Gandhi : కేరళలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. నడిసంద్రంలో జలకాలాటలు ఆడారు;
Rahul Gandhi : కేరళలో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. నడిసంద్రంలో జలకాలాటలు ఆడారు. మత్స్యకారులతో కలిసి అరేబియా సముద్రంలో స్విమ్మింగ్ చేశారు. సముద్రంలో రాహుల్‌గాంధీ సరదాగా ఈత కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో యాత్రలో భాగంగా కొల్లాంలో పర్యటించారు రాహుల్‌గాంధీ. మత్స్యకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారుల చేపల వేట సమస్యలను స్యయంగా తెలుసుకునేందుకు పెద్ద సాహసమే చేశారు. పడవలో వెళ్లి మత్స్యకారులతో కలిసి చేపలు పట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హఠాత్తుగా పడవలోంచి సముద్రంలోకి దూకి జాలర్లతో కలిసి ఈత కొట్టారు. దాదాపు గంట సేపు సముద్రంలో స్విమ్మింగ్ చేసిన రాహుల్‌గాంధీ.. ఇన్నాళ్లకు నా కల తీరిందని ట్వీట్టర్‌లో పోస్టు పెట్టారు.
Rahul Gandhi ji swimming in sea with fishermen in kerala pic.twitter.com/YXGxXDf142
— MD Kareem (@MDKareemWadi) February 25, 2021