RAIN: హిమాచల్, ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం

ఉత్తరాదిని కుదిపేస్తున్న వర్షాలు;

Update: 2025-07-01 03:30 GMT

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు మళ్లీ ప్రకృతి ప్రళయాన్ని ఎదుర్కొంటున్నాయి. హిమాచల్‌లోని 10 జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. శిమ్లాలో ఐదు అంతస్తుల భవనం కూలిపోయినా, అందులోని నివాసితులను ముందుగానే ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కొండ ప్రాంతంలో ఇప్పటికే వందలాది భవనాలు ప్రమాదకరంగా మారినట్లు అధికారులు తెలిపారు.

రహదారుల మూసివేత

గత 24 గం­ట­ల్లో మూడు వే­ర్వే­రు ఘట­న­ల్లో ము­గ్గు­రు మృతి చెం­ద­గా, రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 129 రహ­దా­రు­లు మూ­సే­శా­రు. మండీ, సి­ర్మౌ­ర్‌, సో­ల­న్‌ జి­ల్లా­ల్లో వర్షాల ప్ర­భా­వం తీ­వ్రం­గా ఉంది. సో­ల­న్‌­లో ఓ వం­తెన కొ­ట్టు­కు­పో­యిం­ది. వి­ద్యా­సం­స్థ­ల­కు సో­మ­వా­రం సె­ల­వు ప్ర­క­టిం­చ­డం­తో వి­ద్యా­ర్థుల రా­క­పో­క­ల­పై ప్ర­భా­వం పడిం­ది. ఈ ఏడా­ది వర్షా­కా­లం మొ­ద­లై­న­ప్ప­టి నుం­చి రా­ష్ట్రం­లో 20 మంది ప్రా­ణా­లు కో­ల్పో­యి­న­ట్లు డి­జా­స్ట­ర్ మే­నే­జ్‌­మెం­ట్‌ అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. గత ఏడా­ది ఈ సం­ఖ్య 550. ఇక ఉత్త­రా­ఖం­డ్‌­లో కూడా పరి­స్థి­తి ఉద్రి­క్తం­గా ఉంది. ఆది­వా­రం యము­నో­త్రి రహ­దా­రి­లో కొం­డ­చ­రి­య­లు వి­రి­గి­ప­డ­టం­తో ని­ర్మా­ణం­లో ఉన్న హో­ట­ల్ కు­ప్ప­కూ­లిం­ది. ఏడు­గు­రు గల్లం­త­య్యా­రు. వారి కోసం రె­స్క్యూ టీ­ము­లు గా­లిం­పు కొ­న­సా­గి­స్తు­న్నా­యి. ని­షే­ధా­న్ని తొ­ల­గిం­చిన తర్వాత సో­మ­వా­రం చా­ర్‌­ధా­మ్‌ యా­త్ర తి­రి­గి ప్రా­రం­భ­మైం­ది. కే­దా­ర్‌­నా­థ్‌, బద్రీ­నా­థ్‌, గం­గో­త్రి, యము­నో­త్రి మా­ర్గా­ల్లో ట్రా­ఫి­క్ మళ్లిం­పు, భద్ర­తా చర్య­లు ము­మ్మ­రం­గా చే­ప­ట్టా­రు. వర్షా­లు కొ­న­సా­గే అవ­కా­శ­ముం­డ­టం­తో ప్ర­జ­ల­ను అత్య­వ­స­ర­మైన ముం­దు జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­లు కో­రు­తు­న్నా­రు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వారం రోజుల్లో రూ.29.16 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యుడి) అత్యధికంగా రూ.2 కోట్ల 743.40 లక్షల నష్టం వాటిల్లింది. 6 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, 8 దెబ్బతిన్నాయి. 7 దుకాణాలు, 8 గోశాలలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. 37 జంతువులు, ఎన్నో పక్షులు కూడా కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 53 రోడ్లు ట్రాఫిక్ కోసం మూసివేశారు. 135 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 147 తాగునీటి పథకాలు నిలిచిపోయాయి.

Similar News