Rajasthan Exit Polls 2023: అధికారం దక్కించుకోనున్న బీజేపీ?
ప్రతీ ఐదేళ్లకోసారి అధికార మార్పిడి;
రాజస్థాన్ రాష్ట్రంలో నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవచ్చని తెలుస్తున్నది. 1993 నుంచి ప్రతీ ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారం రాజస్థాన్ లో ఇప్పటి వరకు వరుసగా ఒకే పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తామని, రాష్ట్రంలో ఆనవాయితీని బ్రేక్ చేస్తామని బలంగా చెబుతూ వచ్చింది. కానీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ నేతల వాదనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. మ్యాజిక్ మార్క్ 100. అయితే బీజేపీకి 100-110, కాంగ్రెస్‌కు 90-100, ఇతర పార్టీలకు 5- 15 సీట్లు రావచ్చని గురువారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ద్వారా తెలుస్తున్నది.
ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్ అంచనా ప్రకారం బీజేపీకి 80-90, కాంగ్రెస్‌కు 94-104, ఇతరులు 14-18 స్థానాల్లో గెలుస్తాయి.
దైనిక్ భాస్కర్ అంచనా ప్రకారం బీజేపీకి 98-105, కాంగ్రెస్‌కు 85-95, ఇతర పార్టీలకు 10-15 సీట్లు రానున్నాయి.
ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం బీజేపీకి 80-100, కాంగ్రెస్‌కు 86-106, బీఎస్పీకి 1-2, ఇతర పార్టీలకు 8-16 సీట్లు దక్కనున్నాయి.
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 100-122, కాంగ్రెస్‌కు 62-85, ఇతర పార్టీలకు 14-15 సీట్లు రానున్నాయి.
పీ-మార్క్యూ అంచనా మేరకు బీజేపీకి 105-125, కాంగ్రెస్‌కు 69-91, ఇతర పార్టీలకు 5-15 స్థానాలు దక్కనున్నాయి.
రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ సర్వే ప్రకారం బీజేపీకి 115-130, కాంగ్రెస్‌కు 65-75, ఇతర పార్టీలు 12-19 సీట్లు గెలుస్తాయి.
టీవీ 9 భరత్‌వర్ష్ – పోల్‌స్టర్ ప్రకారం బీజేపీకి 100-110, కాంగ్రెస్‌కు 90-100, ఇతర పార్టీలు 05-15 సీట్లు గెలువనున్నాయి.
టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ మేరకు బీజేపీకి 108-128, కాంగ్రెస్‌కు 56-72, ఇతరులకు 13-2 స్థానాలు రానున్నాయి.