IAS Tina Dabi: రాజస్థాన్‌లో కలెక్టర్-విద్యార్థుల మధ్య డైలాగ్ వార్

విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2025-12-23 06:30 GMT

ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ-విద్యార్థుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తమ సమస్యలు పరిష్కరించేంత సమయం కూడా కలెక్టర్‌కు లేదా? అంటూ విద్యార్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీనా దాబీ ‘రీల్ స్టార్’ అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఐఏఎస్ అధికారిని కించపరిచారన్న కారణంతో పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజస్థాన్‌లో రాజకీయ దుమారం రేపుతోంది.

రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని మహారాణా భూపాల్ కళాశాల (MBC) విద్యార్థులు పరీక్ష ఫీజు పెంపును నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నామని.. 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే యూపీఎసీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన టీరా దాబీని కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఒక ఉపాధ్యాయుడు టీనా దాబీ తమకు ‘రోల్ మోడల్’ అంటూ తెలిపాడు. అయితే బీజేపీ మద్దతుగల విద్యార్థి సంఘం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తో అనుబంధంగా ఉన్న కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయుడితో విభేదించారు. ‘‘కలెక్టర్ రోల్ మోడల్ కాదు. ఆమె రోల్ మోడల్ అయి ఉంటే విద్యార్థుల డిమాండ్లను వినడానికి ఇక్కడికి వచ్చి ఉండేది. ఆమె ఒక రీల్ స్టార్, రీల్స్ చేసుకోవడానికి ఎక్కడికైనా వెళుతుంది. కానీ మా సమస్యలను పట్టించుకోదు.’’ అంటూ విద్యార్థులు విమర్శించారు.

అయితే ఫీజు నిరసిస్తూ ధర్నా చేసిన తర్వాత కొంత మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్టేషన్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పోలీస్ స్టేషన్ చుట్టుముట్టారు. సీనియర్ పోలీసు అధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని… కేవలం ఉద్రిక్తతలు తగ్గించేందుకే కొద్దిసేపు స్టేషన్‌లో ఉంచి పంపేసినట్లు చెప్పారు.

విద్యార్థుల అరెస్ట్‌ను రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఖండించారు. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.

తోసిపుచ్చిన టీనా దాబీ..

విద్యార్థుల అరెస్ట్ వార్తను కలెక్టర్ టీనా దాబీ తోసిపుచ్చారు. రోడ్డును దిగ్బందించడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కొందరిని స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. అంతే తప్ప ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. 2 గంటల్లో విడిచి పెట్టేశారని.. క్షేత్రస్థాయిలో సమస్య సద్దుమణిగిందని చెప్పారు.

Tags:    

Similar News