Assembly Election 2022: ర్యాలీలు, రోడ్‌షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ఎన్నికల కమిషన్..

Assembly Election 2022: ర్యాలీలు, రోడ్‌షోలపై నిబంధనలు సవరించే ఆలోచనలో ఉంది కేంద్ర ఎన్నికల సంఘం.;

Update: 2022-01-31 07:00 GMT

Assembly Election 2022: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండడంతో.. ర్యాలీలు, రోడ్‌షోలపై నిబంధనలు సవరించే ఆలోచనలో ఉంది కేంద్ర ఎన్నికల సంఘం. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున భౌతిక ర్యాలీలు, రోడ్‌ షోలపై కఠిన ఆంక్షలు తగ్గించాలని భావిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర, ఇతర కమిషనర్లు.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆయా రాష్ట్రాల ఎన్నికల ఉన్నతాధికారులతో ఇవాళ వర్చువల్‌గా సమీక్షించనున్నారు. ఇవాళ్టి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News