చెఫ్ విష్ణు మనోహర్ చేతిలో 'రామ్ హల్వా'.. 1800 కిలోల బరువున్న కడాయిలో 7వేల కిలోల హల్వా

రామ్ లల్లా ప్రతిష్ఠాపన తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ కోసం 7000 కిలోల హల్వా తయారు చేయనున్నారు నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్.;

Update: 2024-01-19 08:51 GMT

రామ్ లల్లా ప్రతిష్ఠాపన తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ కోసం 7000 కిలోల హల్వా తయారు చేయనున్నారు నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్. 24 సంవత్సరాల అనుభవం ఉన్న విష్ణు మనోహర్ ను అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే వేడుకకు ప్రసాదాన్ని సిద్ధం చేయడానికి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సంప్రోక్షణ కార్యక్రమంలో 1.5 లక్షల మందికి పైగా భక్తులకు పెట్టడానికి 'రామ్ హల్వా' తయారు చేయబడుతుంది.

1800 కిలోల బరువు, 15 అడుగుల లోతున్న భారీ కడాయిలో 7వేల కిలోల రామ్ హల్వా తయారు చేస్తున్నారు. 

చెఫ్ విష్ణు మనోహర్ గురించి..

నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ కి నాగ్‌పూర్, లాతూర్‌లలో శాఖాహార రెస్టారెంట్‌లు ఉన్నాయి. ఇంకా పూణేలో రెండు, యునైటెడ్ స్టేట్స్‌లో నాలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. తన సహాయకుల ద్వారా మూడు గంటల్లో రామ్ హల్వాను తయారు చేయనున్నారు. అనంతరం హల్వాను వాలంటీర్ల ద్వారా వీఐపీలు, సందర్శకులు, స్థానికులకు పంపిణీ చేస్తారు.

రామభక్తుడు మరియు మాజీ కర్ సేవక్ విష్ణు మనోహర్ ప్రపంచ రికార్డులకు కొత్తేమీ కాదు. అతిపెద్ద పరాటా, అతిపెద్ద కబాబ్, మిస్సాల్, ఖిచ్డీ వరకు అతను ఇప్పటికే 18 వంటకాల్లో రికార్డు సృష్టించాడు.

నేను నా 20 ఏళ్ల వయసులో కరసేవక్‌గా ఉండేవాడిని. అయోధ్యను కూడా సందర్శించాను. నేను ఎప్పుడూ రామ్ మరియు శివాజీ మహారాజ్ పట్ల అంకితభావంతో ఉన్నాను. జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభిస్తామని మోహన్ భగవత్ దసరా సందర్భంగా ప్రకటించినప్పుడు, రాముడి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. సాంప్రదాయకంగా, అలాంటి సందర్భాలలో మనం ఏదైనా స్వీట్ చేస్తాం, కాబట్టి నేను రామ్ హల్వాను తయారు చేయాలని అనుకున్నాను.

హల్వా తయారీలో ఏ పదార్థాలు మరియు ఏ పరిమాణంలో ఉపయోగించబడతాయి?

700 కిలోల రవ్వ (సెమోలినా), 700 కిలోల నెయ్యి, 1120 కిలోల పంచదార, 1850 లీటర్ల పాలు, 1850 లీటర్ల మినరల్ వాటర్, 21 కిలోల యాలకుల పొడి, 21 కిలోల జాజికాయ పొడి, 1162 అరటిపండ్లు, 50 కిలోల 300 కిలో తులసి ఆకులను ఉపయోగించి రామ్ హల్వా తయారు చేయబడుతుంది. తిరుమలలోని తిరుపతి బాలాజీ ఆలయం నుంచి నెయ్యి కొనుగోలు చేశారు.

ఈ స్థాయిలో ఎవరూ హల్వాను తయారు చేయలేదు మరియు అది మెత్తగా లేదా పొడిగా కాకుండా పరిపూర్ణంగా ఉండేలా చూసుకోవాలనుకున్నాను. మంచి హల్వా చేయడానికి రవ్వను సరైన రీతిలో వేయించడం చాలా ముఖ్యం అని అన్నారు.

నేను ఆ పని చేయగలనని సంతృప్తి చెందాక, నా ప్రతిపాదనతో విశ్వహిందూ పరిషత్‌ని సంప్రదించాను. వారు ఆమోదించిన తర్వాత, నేను నా ఆలోచనను అయోధ్యలోని ఆలయ ట్రస్టుకు పంపాను. వారు ఈ ఆలోచనను ఇష్టపడ్డారు కానీ జనవరి 22 తర్వాత చేయమని సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ రోజు అయోధ్యలో ప్రజల సంఖ్యపై ఆంక్షలు ఉండబోతున్నాయి. అంత పెద్ద మొత్తంలో హల్వాను తయారు చేసి ఎక్కువ మంది తినకుండా ఉంటే ప్రయోజనం ఏమిటి? కాబట్టి మేము జనవరి 26 తర్వాత తయారు చేయాలని నిర్ణయించుకున్నాము. జనవరి 29-31 మధ్య రామ్ హల్వా తయారు చేయబడుతుంది.

హల్వా తయారీలో ఎంత మంది పాల్గొంటారు?

నేను మరియు నా ఇద్దరు సహాయకులు మాత్రమే. చాలా మంది పాల్గొంటే అది సరిగా రాదు అని తెలిపారు.

కడాయి గురించి..

మా వద్ద 10,000 లీటర్ల పాత కధాయ్ ఉన్నప్పటికీ, ఇది ఒక ముఖ్యమైన శుభ సందర్భం కాబట్టి నేను కొత్త దానిని ఉపయోగించాలనుకుంటున్నాను. మేము ఇప్పుడు 15 అడుగుల లోతు, ఐదు అడుగుల వ్యాసార్థంలో కొత్త కడాయిని తయారు చేస్తున్నాము. మూత 300 కిలోల బరువు ఉంటుంది, మొత్తం కడాయి 1800 కిలోలు ఉంటుంది.

ప్రసాదం తయారీకి అయ్యే ఖర్చును ఎవరు భరిస్తున్నారు?

పదార్ధాల ఖర్చును ఆలయ ట్రస్ట్ భరిస్తుంది. కధాయ్‌కు రూ. 10-12 లక్షలు ఖర్చవుతుంది, అది పూర్తిగా నేనే భరిస్తాను. నిజానికి, మేము ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాము. కారు కొనడానికి కొంత డబ్బు ఉంచాము. కానీ మేము దానిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాము. బదులుగా డబ్బును కడాయి నిర్మాణానికి ఉపయోగించాము. ఎప్పుడైనా కారు కొనుగోలు చేయవచ్చు కానీ రామ్ కోసం ఏదైనా చేసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది.

నాగ్‌పూర్‌కు చెందిన మహావీర్ స్టీల్ కధాయ్‌ను తయారు చేస్తోంది. నాగ్‌పూర్ నుండి అయోధ్యకు కడాయిని రవాణా చేసే ట్రక్కు డ్రైవర్ ముస్లిం. ఇందులో భాగమైనందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కడాయిని తీసుకుని అయోధ్యకు బయలుదేరే ముందు సంప్రదాయ సంగీతం, నృత్యంతో ప్రారంభిస్తాము. కడాయికి పూజ చేస్తాము.

దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ ఇద్దరూ పూజా కార్యక్రమాలకు హాజరుకానున్నారు. తదుపరి స్టాప్ నాగ్‌పూర్‌లోని రామ్‌టెక్ అనే చిన్న గ్రామం, రాముడు వనవాసానికి వెళ్లే ముందు మార్గ మంద్యంలో ఇక్కడ బస చేశాడు. కధాయ్ హిందూ దేవాలయ ప్రదేశమైన కోరాడికి చేరుకుంటుంది. అక్కడ మేము 5000 కిలోల ప్రసాదాన్ని తయారు చేస్తాము అని చెఫ్ విష్ణు పంచుకున్నారు.

ఈ రామ్ హల్వాతో మీరు ప్రపంచ రికార్డు సృష్టిస్తారు.

అవును. కానీ ప్రపంచ రికార్డు సృష్టించాలనే ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతోంది. ఆ రికార్డు నా పేరు మీద ఉండదు కానీ అయోధ్య ఆలయ ట్రస్ట్ పేరు మీద ఉంటుంది.

మీ ప్రయత్నానికి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..

ఇదే ప్రసాదాన్ని తయారు చేసి పంపమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి ఫోన్లు వస్తున్నాయి. నిన్ననే లండన్ నుండి ఒక రామభక్తుడు ఫోన్ చేసి 15 కిలోల ప్రసాదాన్ని లండన్ పంపమని అభ్యర్థించాడు. ఆస్ట్రేలియా, అమెరికా నుంచి కూడా ఫోన్ చేశారు.

మీరు 18 ప్రపంచ రికార్డులను కలిగి ఉన్నారు కదా.. మరి అంత పెద్ద మొత్తంలో తయారు చేసిన ఆహారం ఏం చేస్తారు.. ఎవరికి పంచి పెడతారు అని అడిగితే..

తినే ఆహారం విషయంలో ఏదైనా తయారు చేసి రికార్డు సృష్టించాలనుకుంటే.. దానిని నిర్దిష్ట వ్యవధిలో వినియోగించగలగాలి. నేను సాధారణంగా ఒక NGOతో కనెక్ట్ అవుతాను. అది పేదలకు పంపిణీ చేస్తుంది. భగవంతుని దయ వల్ల 3-4 గంటల్లోనే ఆహారం మొత్తం అయిపోతుంది. దానిని తయారు చేసి రికార్డు సృష్టించిన ఆనందం కంటే ఎంతో మంది ఆకలి తీర్చినందుకు, వారు సంతృప్తి చెందినందుకు ఆనందంగా ఉంటుంది అని అన్నారు విష్ణు మనోహర్.  

Tags:    

Similar News