రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలక రెపో రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత రెపో రేటు 5.50% వద్ద కొనసాగించాలని MPC ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీనిలో ఎటువంటి మార్పు చేయలేదు. ఈ నిర్ణయం వరుసగా నాలుగోసారి రెపో రేటులో మార్పు లేకుండా కొనసాగిస్తోంది.ఈ సమావేశంలో కూడా ద్రవ్య విధాన వైఖరిని తటస్థంగా కొనసాగించాలని నిర్ణయించారు. ద్రవ్యోల్బణం అంచనాలు స్థిరంగా ఉన్నందున, దానిని మరింత నియంత్రణలోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం సహాయపడుతుందని RBI పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరమని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అమెరికా వంటి దేశాల్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, వాణిజ్య సుంకాలపై నెలకొన్న గందరగోళం వంటి అంశాలు కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపించాయి.