1991లో భారత ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం ఉండగా, మన్మోహన్ ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది 6-7 శాతానికి చేరుకుంది. ఇది అంతర్జాతీయ రుణదాతల నమ్మకాన్ని పెంపొందించింది. ప్రపంచ బ్యాంక్, IMF నుంచి రుణ సాయం అందడంతో ఆర్థిక వ్యవస్థను నిలబడింది. భారత రూపాయిపై విశ్వసనీయత పెరిగి, దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. రెండేళ్లలోనే భారత విదేశీ నిల్వలు 1 బిలియన్ నుంచి 10 బిలియన్లకు చేరాయి.
1991 ఆర్థిక సంస్కరణ కారణంగా IT, మాన్యుఫాక్చరింగ్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి దొరికింది. ప్రస్తుతం ఉన్న ఐటీ రంగ వృద్ధికి అప్పటి నిర్ణయాలే పునాదులు. భారత్‌లో పోటీ పెరిగి, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయి. మధ్యతరగతి ఆదాయం పెరిగి, వినియోగం పెరిగింది. FDIలు భారీగా వచ్చాయి. ఆయన సంస్కరణల వల్ల భారతదేశం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది.