Vice President : రాజీనామాకు ముందు రిటైర్ మెంట్ వ్యాఖ్యలు...ఉప రాష్ట్రపతి వీడియో వైరల్
తన పదవీ కాలం ముగియక ముందే అనూహ్య రీతిలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసారు. ఆరోగ్య కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. అయితే, పదవీకాలం ముగియకముందే ఆయన రాజీనామా చేయడంపట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ అవుతోంది. రాజీనామా కు పది రోజుల ముందు తన పదవీ విరమణ గురించి ప్రస్తావించారు జగదీప్. తన రిటైర్ మెంట్ దైవ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 2027 ఆగస్టులో సరైన సమయంలో రిటైర్ అవుతానన్నారూ. జులై 10న జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ఉప రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతరం పది రోజులకు అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు .. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను పంపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ)కు అనుగుణంగా ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.