Rhea Singha : మిస్ యూనివర్స్ ఇండియా విన్నర్ రియా సింఘా

Update: 2024-09-24 09:45 GMT

గుజరాత్ కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. త్వరలో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఇండియాకు ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉత్కంఠగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే పోటీల్లో రియా సింఘా విజేతగా నిలిచింది.

ఫైనల్లో 51 మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న వేళ రియా భావోద్వేగానికి గురైంది. టైటిల్ గెలవడం బూస్టింగ్ ఇచ్చిందని చెప్పింది. ఈ పోటీలకు నటి ఊర్వశి రౌతేలా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక మిస్ యూనివర్స్ ఈవెంట్ ఈ ఏడాది నవంబర్ 16న మెక్సికోలో జరగనుంది. 

Tags:    

Similar News