2000 Note: నోట్ల మార్పిడికి ఇంకా 4 రోజులే గడువు
ఇంకా మార్కెట్లో మరో 7 శాతం నోట్లు;
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుతో రూ.2 వేల నోటు మార్పిడికి గడువు ముగిసిపోతుంది. దీంతో ఇప్పటికీ మీవద్ద పెద్ద నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు ముగుస్తోంది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బ్యాంకుల్లో ఈ నోట్లు మార్చుకోవచ్చు. ఆ తర్వాత 2 వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్‌బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది. నోట్ల మార్పిడికి మే 23 నుంచి బ్యాంకుల్లో మార్చుకునేందుకు అనుమతిచ్చింది.ఏదైనా బ్యాంకు శాఖలో ఒక రోజులో గరిష్ఠంగా 20 వేల రూపాయల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అదే సాధారణ సేవింగ్స్ అకౌంట్లు, జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లకు మాత్రం ఎలాంటి పరిమితీ లేదు. ఒకవేళ ఒకే రోజు 50 వేల రూపాయలకు పైబడి డిపాజిట్ చేయాల్సి వస్తే మాత్రం ఐటీ నిబంధనల ప్రకారం పాన్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
నోట్ల మార్పిడికి స్లిప్ గానీ, ధ్రువీకరణ పత్రం గానీ అవసరం లేదని ఆర్‌బీఐ చెప్పినప్పటికీ.. కొన్ని బ్యాంకులు మాత్రం ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 1 నాటికి కేవలం 7 శాతం 2 వేల రూపాయల నోట్లు మాత్రమే వెనక్కి రావాలని ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి. గడిచిన 24 రోజుల్లో ఎన్ని నోట్లు బ్యాంకులకు చేరాయి? ఇంకా మొత్తంగా ఎన్ని చేరుతాయి? అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోటు గురించి ఆర్‌బీఐ ఏం నిర్ణయం తీసుకుంటోందనేది ఆసక్తికరంగా మారింది. నిర్దేశిత గడువు దాటిన తర్వాత కూడా 2 వేల రూపాయల నోటు లీగల్ టెండర్‌గా కొనసాగే అవకాశం ఉందని, లావాదేవీలకు అనుమతివ్వకుండా ఆర్‌బీఐ శాఖల వద్ద మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో డెడ్‌లైన్‌లోపు ఎందుకు మార్చుకోలేకపోయిందీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.