మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రక్షాబంధన్ రోజున చోటుచేసుకున్న ఈ ఘటన మనసును కలచివేస్తోంది. భార్యతో ఆనందంగా బయలుదేరిన అమిత్ యాదవ్ జీవితంలో క్షణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. జాతీయ రహదారిపై ట్రక్కు ఢీకొని భార్య గ్యార్సి ప్రాణాలు కోల్పోయింది. గాయాలతో తల్లడిల్లుతున్న భర్త, భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ అంబులెన్స్ లేదు, సాయం చేయాలనుకునే మనసులు లేవు. దారిలో వెళ్తున్న వాహనదారులందరినీ వేడుకున్నాడు… ఎవ్వరు ఆగలేదు. చివరికి తన బైక్ వెనుక భార్య మృతదేహాన్ని తాళ్లతో కట్టి స్వగ్రామం వైపు బయల్దేరాడు. ఆ దృశ్యం చూసిన వారందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. హృదయాలు ముక్కలయ్యాయి. పోలీసులు అడ్డుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినా… ఈ ఘటన మనలో మిగిలిన మానవత్వం ఎక్కడుందో ప్రశ్నిస్తోంది.