RBI Governor : ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు

Update: 2024-12-12 10:15 GMT

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన గవర్నర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ గవర్నర్‌గా సేవలందించిన శక్తికాంత దాస్‌ పదవీకాలం డిసెంబర్‌ 10 తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్‌ మల్హోత్రాను మోదీ సర్కారు తీసుకొచ్చింది. నిన్న దాస్‌ పదవీ విమరణ చేయడంతో.. ఆర్బీఐ తదుపరి గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

Tags:    

Similar News