Delhi Liquor Scam: అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న శరత్ తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని రౌస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేసుకోగా కోర్టు అనుమతించింది;
ఢిల్లీ మద్యం కేసులో కీలక మలపు తిరిగింది. అప్రూవర్‌గా మారారు శరత్ చంద్రారెడ్డి. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న శరత్ తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని రౌస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేసుకోగా కోర్టు అనుమతించింది. ఇప్పటికే ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్‌గా మారడంతో లిక్కర్ స్కామ్‌లో వేగంగా మారుతున్నాయి పరిణామాలు.
వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసుకొని అవినీతి మార్గంలో సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారన్న అభియోగాలపై శరత్‌చంద్రారెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకున్నారు. అ తరువాత తన నానమ్మ, భార్య అనారోగ్య కారణాలతో శరత్ బెయిల్ పైన విడుదలైయ్యారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఈ కేసులో రోజుకో సంచలనం బయటికొస్తోంది...తమ పేర్లు కూడా బయటకు వస్తాయనే అనే భయాందోళనలో కొందరు కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది..లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న రెండు రాష్ట్రాల రాజకీయ నేతల్లో ఇప్పటికే కలవరపాటు మొదలైంది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ సంస్థ పాత్రే కీలకం అని తేల్చింది ఈడీ. ఈ సౌత్ గ్రూప్‌ను అరబిందో డైరెక్టర్ శరత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల నియంత్రణలో ఉన్నట్లు ఈడీ గతంలో ఓ నివేదికలో తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చినట్టు నివేదికలో తెలిపింది. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో లైసెన్సులు మంజూరు చేసిన 32 రిటైల్ జోన్లలో సింహభాగం శరత్ చంద్రారెడ్డివేనని ఈడీ తెలిపింది. ఆయనకు చెందిన అవంతికా కాంట్రాక్టర్స్ లిమిటెడ్, ట్రైడెంట్ కెమ్‌ఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఎకోసిస్టమ్స్ ఐదు జోన్లను దక్కించుకున్నాయి.