Jayalalitha: జయలలిత మృతి కేసు విషయంలో మరోసారి శశికళ విచారణకు..
Jayalalitha: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ స్టాలిన్‌కు నివేదిక సమర్పించింది.;
Jayalalitha: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ స్టాలిన్‌కు నివేదిక సమర్పించింది. కమిషన్ ప్రతిపాదన మేరకు జయలలిత నిచ్చెలి శశికళను విచారించేందుకు తమిళనాడు కేబినెట్ నిర్ణయించింది. సోమవారం సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శశికళతో పాటు నాటి ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ సహా పలువురిని విచారణకు ఆదేశించాలన్న సిఫార్సులపై న్యాయనిపుణులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.