SBI : ఏటీఎం విత్ డ్రాలతో SBIకి రూ.331 కోట్ల లాభం

Update: 2025-03-28 10:15 GMT

ప్రభుత్వ రంగంలోకి అతిపెద్ద బ్యాంక్ ఎస్ బీఐ ఏటీఎం విత్ డ్రాల నుంచి సంవత్సరానికి 331 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఈ ఆదాయాన్ని సాధించింది. మిగిలిన 11 ప్రభుత్వ రంగ బ్యాంక్ లకు సంయుక్తంగా 925 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మొత్తం ఏటీఎం డబ్బులు విత్ డ్రాలో ఎస్బీఐ 31 శాతం వాటా కలిగి ఉంది. గడిచిన ఐదు సంవత్సరాల్లో 1920 నుంచి 2023-24 వరకు ఎస్బీఐ 2,043 కోట్లు ఆర్జించింది. మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంక్లు సంయుక్తంగా 3,738.78 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. మొత్తంగా చూస్తే కెనరా బ్యాంక్, పంజాజ్ నేషనల్ బ్యాంక్ లు స్వల్ప లాభాన్ని పొందాయి. గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎస్ బీఐ లాభాలు పొందాయి. దేశ వ్యాప్తంగా ఎస్బీఐకి 65 వేలకు పైగా ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. పరిమితి దాటిన తరువాత ఎస్బీఐ ఏటీఎం విత్ లపై కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది.

Tags:    

Similar News