School Students Marriage : బస్టాప్‌లోనే స్కూల్ విద్యార్ధుల పెళ్లి..
School Students Marriage : చదువుకోవాల్సిన టైమ్‌లో తొందరపడ్డారు.. పెద్ద వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు;
School Students Marriage : చదువుకోవాల్సిన టైమ్‌లో తొందరపడ్డారు.. పెద్ద వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.. విద్యార్థినికి బస్ షెల్టర్‌లోనే తాళి కట్టేశాడు ఓ విద్యార్థి.. ఈ ఘటన తమిళనాడులోని చిదంబరంలో వెలుగు చూసింది.. ఇద్దరు టీనేజర్ల పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. విద్యార్థిని పన్నెండో తరగతి చదువుతుండగా, యువకుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు.
విద్యార్థిని స్కూల్ యూనిఫామ్‌లో స్థానిక గాంధీనగర్‌లోని బస్ షెల్టర్‌లో కూర్చొని ఉండగా.. యువకుడు తాళి తీసి ఆమె మెడలో కట్టేశాడు.. తోటి విద్యార్థులు ఈ తతంగాన్ని వీడియో తీశారు.. తాళి మెడలో కట్టగానే వారిద్దరిపై పూలు చల్లారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సామాజికవాదులు భగ్గుమంటున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే, వారిద్దరూ మైనర్లు కావడంతో కేసు నమోదు చేయని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది.