ED Raids: ఢిల్లీ మంత్రిపై మనీలాండరింగ్ కేసు
సీఎం విచారణకు ముందే ఈడీ దాడులు;
ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ విచారణకు ముందు ఆయన కేబినెట్‌లోని మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని 12 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది.
దిగుమతులపై రూ.7 కోట్లకుపైగా కస్టమ్స్ ఎగవేత, హవాలా లావాదేవీలకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఫిర్యాదు ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. పటేల్ నగర్ ఎమ్మెల్యే అయిన ఆనంద్ ప్రస్తుతం ఢిల్లీ సాంఘిక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తురన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్ గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే.
సోదాలు కస్టమ్స్ కేసుతో ముడిపడి ఉన్నాయి మరియు ఆనంద్ హవాలా లావాదేవీలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియాలోని మంత్రి ప్రాంగణాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని ఈడీ అధికారులు చెప్పారు. ఆప్ ఎమ్మెల్యే అయిన ఆనంద్ ఢిల్లీ సాంఘీక సంక్షేమం, ఎస్సీఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తురన్నారు.
లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఆనంద్ ఇంటిపై దాడులు జరిగాయి. ఇదే కేసులో కేజ్రీవాల్ సహచరుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే కటకటాలపాలయ్యారు. మరో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సంజయ్ సింగ్ కూడా మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్నారు.