Airports : విమానాశ్రయాలకు భద్రతా ముప్పు.. ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక

Update: 2025-08-06 15:30 GMT

విమానాశ్రయాలకు భద్రతా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలపై ఉగ్రవాదులు లేదా సంఘ విద్రోహ శక్తులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. విమాన ప్రయాణాలు, ఎయిర్ క్రాఫ్ట్లలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించవచ్చని హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో, విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికుల తనిఖీలను మరింత కఠినతరం చేశారు. సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈ హెచ్చరికలు ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతను పెంచాయి. ఈ ముప్పును ఎదుర్కోవడానికి నిఘా వర్గాలు, భద్రతా దళాలు కలిసి పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News