Navjot Singh Sidhu: స్టేజ్ 4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సిద్ధూ భార్య

బతికే ఛాన్స్ తక్కువ అయినా కఠినమైన డైట్‌తో క్యాన్సర్ ఖతం..;

Update: 2024-11-23 01:45 GMT

 మాజీ క్రికెటర్, పొలిటిషీయన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 క్యాన్సర్‌ని విజయవంతంగా ఓడించారు. ఆమె బతికే అవకాశం 3 శాతం మాత్రమే ఉందని వైద్యులు ప్రకటించినప్పటికీ, స్టేజ్-4 క్యాన్సర్‌ని అధిగమించారిన నవజ్యోత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నవజ్యోత్ కౌర్ ఒక సంవత్సరం నుంచి స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతోంది. స్టేజ్-3 ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలో వైద్యులు చిన్న ఆశ కల్పించాలరని వెల్లడించారు.

‘‘మా అబ్బాయి పెళ్లి తర్వాత ఆమెకు క్యాన్సర్ తిరిగి వచ్చింది. ఆమె బతుకుతుందా..?లేదా..? అనే అనుమానం మాలో ఉండేది. కానీ ఆమె ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. క్యాన్సర్‌ని ధైర్యంగా ఎదుర్కొంది’’ అని తన పోస్టులో వెల్లడించారు. పాటియాలలోని ప్రభుత్వ రాజేంద్ర మెడికల్ కాలేజీలో కౌర్ చికిత్స పొందిందని సిద్దూ ప్రస్తావించారు. ‘‘తమకు డబ్బు ఉందని ఆమె క్యాన్సర్‌ని ఓడించలేదు, ఆమె క్రమశిక్షణ, కఠినమైన దినచర్య, డైట్ అనుసరించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా క్యాన్సర్ సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు’’ అని సిద్దూ పేర్కొన్నారు.

ఆయుర్వేదం కాపాడింది:

ఆమె నిమ్మరసం, పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసి వంటివి ఆహారంగా తీసుకుందని సిద్దూ దంపతులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఈ ఆరోగ్యకరమైన పదార్థాలతో పాటు గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్, వాల్‌నట్‌తో తయారు చేసిన జ్యూసులు తీసుకుందని వెల్లడించారు. ఆమె తన ఆహారంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ఆహారాలను తీసుకుందని చెప్పారు. కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు లేదా బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తీసుకున్నారని, దీంతో పాటు ఆమె ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు , బెల్లం, యాలకులు తీసుకున్నట్లు తెలిపారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే.. 

ఐతే సిద్ధు వ్యాఖ్యలపై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఓ నెటిజన్ పేర్కొంటూ... కేవలం డైట్ వల్లే ఆమెకు 40 రోజుల్లో క్యాన్సర్‌ రహితం అయితే ఈ చికిత్స ఎందుకు? అంటూ ప్రశ్నించారు. మరొకరు స్పందిస్తూ.. సిద్ధూ తన భార్యకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ప్రభుత్వ ఆసుపత్రుల చికిత్స ప్రక్రియను ఎక్కడ ప్రశంసించాడో తెలియదు, కానీ ఈ వ్యాధి విషయంలో ఈ ఆయుర్వేద పద్ధతి అర్ధంలేనిది. కొన్ని మూలికలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, అవి క్యాన్సర్‌ను నయం చేయగలవని నిరూపించబడలేదు. క్యాన్సర్ చికిత్సలు కేవలం 40 రోజులు కాకుండా నెలలు లేదా సంవత్సరాలు తరబడి చేయాల్సి వుంటుంది.

మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని ఇలా రాశారు.. అల్లోపతి చికిత్సతో పాటు, ఆమె ఆహారంలో ఆయుర్వేద పదార్థాలను కూడా చేర్చారు. కేవలం అల్లోపతి చికిత్సతో, ఆమె మనుగడ సాగించలేదు, కానీ ఆయుర్వేదం జోడించడం ద్వారా, ఆమె జీవించి ఉండటమే కాకుండా క్యాన్సర్ నుండి రక్షించబడింది". ఇలా మొత్తమ్మీత సిద్ధూ చెప్పిన మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Tags:    

Similar News