Parliament: ‘సర్’పై పట్టువీడని విపక్షాలు-లోక్‌సభ వాయిదా
పాల్గొన్న ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక
పార్లమెంట్ ఆవరణలో ఇవాళ విపక్ష సభ్యులు .. సిర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఓటర్ల జాబితా సవరణ కాంక్షిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ నిరసన కొనసాగిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ జరిగిన నిరసన ప్రదర్శనలో రాహుల్ గాందీ, సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఉభయసభల్లోనూ విపక్షాలు సిర్ అంశాన్ని ప్రస్తావించాయి. వోట్ చోరీ, గద్ది చోరీ అంటూ విపక్ష సభ్యులు లోక్‌సభలో నినాదాలు చేస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను మద్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులు సిర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ‘SIR’ చేపట్టింది. ఈ ప్రత్యేక ఓటర్ సర్వే ద్వారా అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పని చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సర్వే చేపట్టింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ఈ అంశంపైనే విపక్షాలు ఆందోళన చేశాయి. తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో కూడా సర్వే జరుగుతోంది. సర్వే నిలిపివేయాలని.. ఒత్తిడి భరించలేక బీఎల్‌వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.