SIR : రెండుసార్లు ఓటు వేయకపోతే ఓటుహక్కు రద్దు.. మంచిదేనా..?

Update: 2025-12-27 08:00 GMT

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ మీద పెద్ద రచ్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు మొత్తం ఓటుచోరీ జరిగింది అంటూ ఇన్ని రోజులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన ఎస్ఐఆర్ విధానంలో అనేక దొంగ ఓట్లు బయటపడుతున్నాయి. తమిళనాడులో 90 లక్షలకు పైగా ఓట్లు, పశ్చిమ బెంగాల్ లో 70 లక్షలు, బీహార్ లో 80 లక్షలకు పైగా నకిలీ ఓట్లు బయటపడటంతో వాటిని సిఇసి తొలగించింది. దీనిపై ప్రతిపక్షాలు నానా గొడవ చేస్తున్నాయి. కావాలనే బిజెపికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల ఓట్లు మొత్తం తొలగిస్తున్నారు అని మండిపడుతున్నాయి. ఇక్కడ మనం చాలా విషయాలు గమనించాలి. కొందరు ఒకచోట నివాసం ఉంటూ ఆ రాష్ట్రంలో అలాగే ఇంకో రాష్ట్రంలో కూడా ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. ఈ లెక్కన ఒక్కో వ్యక్తికి రెండు, మూడు ఓటు హక్కులు కూడా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తికి ఒకే ఓటు హక్కు మాత్రమే ఉండాలి. ఇలా రెండు లేదా మూడు ఉండటం ఏంటి. పైగా ఈ ఎస్ ఐఆర్ వచ్చిన తర్వాత బయటిదేశాల నుంచి వచ్చిన వారు కూడా మన దేశంలో అనేక సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నారని బయటపడింది.

నిజంగా ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఎస్ ఐఆర్ లో దొంగ ఓట్లు మాత్రమే తొలగించాలి. అర్హుల ఓట్లు అస్సలు తొలగించొద్దు. త్వరలోనే తెలంగాణలో కూడా ఈఎస్ఐఆర్ రాబోతోంది. ఇక్కడ ఎలా ఉంటుందో దాని ప్రభావం వేచి చూడాలి. అయితే చాలామంది ఓటు హక్కు ఉండి కూడా ఓటు వేయట్లేదు. ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక రూల్ తీసుకువచ్చింది. కంటిన్యూగా రెండుసార్లు ఓటు వేయకపోతే ఓటు హక్కు రద్దు చేస్తామని చెబుతోంది. నిజంగా ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా కేవలం 40 నుంచి 50% మధ్యలోనే ఓటింగ్ జరుగుతుంది. అంటే మిగతా వారంతా ఏమైనట్టు. అవన్నీ దొంగ ఓట్లా, లేదంటే డబల్ ఓట్లు అనుకోవాలా. ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. అలా వేయకపోతే ఆ ఓటు హక్కునే అవమానించినట్టు అవుతోంది.

పల్లెటూర్లలో ఏ ఎన్నిక జరిగినా సరే 90 శాతానికి పైగా పోలింగ్ జరుగుతుంది. కానీ నగరాల్లోనే ఇలాంటి తక్కువ పోలింగ్ ను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండుసార్లు ఓటు వేయని వారు ఓటు హక్కును కచ్చితంగా తొలగించాల్సిందే. అప్పుడు దొంగ ఓట్లు కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. త్వరలోనే తెలంగాణలో ఈ ఎస్ ఐఆర్ విధానం మీద ఎంత రచ్చ జరుగుతుందో అని ఇప్పటికే చాలా చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఓవైపు ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తోంది. ఇలాంటి సమయంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఈ ఎస్ ఐఆర్ విధానం మీద ఇంకెంత రచ్చ జరుగుతుంది అనేది త్వరలోనే మనం చూడబోతున్నాం.


Full View

Tags:    

Similar News