SISTERS: ప్రాంతీయ పార్టీలకు సిస్టర్‌ స్ట్రోక్స్‌

వైసీపీ–బీఆర్ఎస్–ఆర్జేడీ: కుటుంబ యుద్ధాలు హీట్.. షర్మిల దాడితో జగన్ ఇమేజ్‌కు డామేజ్.. కవిత ఆరోపణలతో బీఆర్ఎస్‌లో అల్లకల్లోలం

Update: 2025-11-17 07:30 GMT

తె­లు­గు రా­జ­కీ­యా­ల్లో మొ­న్న షర్మిల, ని­న్న కవిత రూ­పం­లో కని­పిం­చిన ‘‘సి­స్ట­ర్ స్ట్రో­క్’’ ఇప్పు­డు బీ­హా­ర్ రా­ష్ట్రం­లో రో­హి­ణి ఆచా­ర్య వం­తు­కు వచ్చిం­ది. ప్రాం­తీయ పా­ర్టీ­ల­లో వా­ర­స­త్వ రా­జ­కీ­యా­లు, కు­టుంబ వి­భే­దా­లు ఎంత తీ­వ్ర­మైన పరి­ణా­మా­ల­కు దా­రి­తీ­స్తు­న్నా­యో ఈ మూడు ఘట­న­లు స్ప­ష్టం చే­స్తు­న్నా­యి. అధి­కార పా­ర్టీ­ల­కు లేదా అధి­కార ఆశతో ఉన్న పా­ర్టీ­ల­కు సొంత కు­టుంబ సభ్యుల నుం­చే ఎదు­ర­వు­తు­న్న ఈ సవా­ళ్లు... ఆయా పా­ర్టీల భవి­ష్య­త్తు­పై, నేతల ప్ర­తి­ష్ట­పై తీ­వ్ర ప్ర­భా­వం చూ­పు­తు­న్నా­యి. ప్రాం­తీయ పా­ర్టీ­ల్లో కీలక నా­య­కుల సో­ద­రీ­మ­ణు­లు, సొంత అన్న­ద­మ్ము­ల­పై­నే తి­రు­గు­బా­టు చే­య­డం లేదా ఆరో­ప­ణ­లు గు­ప్పిం­చ­డం ఇటీ­వల చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. ము­ఖ్యం­గా తె­లు­గు రా­ష్ట్రా­లైన ఆం­ధ్ర­ప్ర­దే­శ్, తె­లం­గా­ణ­ల­లో వై­సీ­పీ,బీ­ఆ­ర్ఎ­స్ లను ఈ పరి­ణా­మా­లు కు­ది­పే­శా­యి. ఇప్పు­డు బీ­హా­ర్‌­లో రా­ష్ట్రీయ జనతా దళ్ (ఆర్జే­డీ) వంతు వచ్చిం­ది.

వైసీపీకి షర్మిల స్ట్రోక్: రాజకీయ వైరం

ది­వం­గత వై­ఎ­స్ రా­జ­శే­ఖర రె­డ్డి వా­ర­సు­లు­గా వై­ఎ­స్ జగన్ మో­హ­న్ రె­డ్డి రా­జ­కీ­యా­ల్లో­కి వచ్చా­రు. ఆయన జై­లు­లో ఉన్న­ప్పు­డు సో­ద­రి వై­ఎ­స్ షర్మిల పా­ద­యా­త్ర చేసి పా­ర్టీ­కి అం­డ­గా ని­లి­చా­రు. 2019లో వై­సీ­పీ అధి­కా­రం­లో­కి వచ్చాక ము­ఖ్య­మం­త్రి­గా జగన్ బా­ధ్య­త­లు చే­ప­ట్టా­రు. అయి­తే, ఆ తర్వాత కొ­న్నా­ళ్ల­కే జగన్-షర్మిల మధ్య దూరం పె­రి­గిం­ది. తొ­లుత తె­లం­గా­ణ­లో వై­ఎ­స్సా­ర్‌­టీ­పీ స్థా­పిం­చిన షర్మిల... చి­వ­రి­కి అన్న­తో రా­జ­కీ­యం­గా నే­రు­గా ఢీ­కొ­ట్టా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­రు. వై­ఎ­స్సా­ర్‌­టీ­పీ­ని కాం­గ్రె­స్‌­లో వి­లీ­నం చేసి, ఆం­ధ్ర­ప్ర­దే­శ్ కాం­గ్రె­స్ అధ్య­క్షు­రా­లి­గా బా­ధ్య­త­లు చే­ప­ట్టా­రు. దీం­తో 2024 ఏపీ అసెం­బ్లీ ఎన్ని­క­ల­కు ముం­దు జగ­న్‌­కు వ్య­తి­రే­కం­గా ప్ర­తి­ప­క్షా­ల­కు బల­మైన అస్త్రం లభిం­చి­న­ట్ల­యిం­ది. ‘‘చె­ల్లె­లి­కి న్యా­యం చే­య­లే­ని వ్య­క్తి, రా­ష్ట్ర మహి­ళ­ల­కు ఏం న్యా­యం చే­స్తా­డు?’’ అనే వి­మ­ర్శ­లు పతాక స్థా­యి­కి చే­రా­యి.

బీఆర్ఎస్‌కు కవిత స్ట్రోక్: ఆరోపణల అగ్గి

తె­లం­గాణ మాజీ సీఎం కే­సీ­ఆ­ర్ కు­మా­ర్తె, మాజీ ఎంపీ కవిత వ్య­వ­హా­రం కూడా బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­లో ప్ర­కం­ప­న­లు సృ­ష్టిం­చిం­ది. ఢి­ల్లీ లి­క్క­ర్ స్కా­మ్ కే­సు­లో జై­లు­కు వె­ళ్లి వచ్చిన తర్వాత కవిత... పా­ర్టీ నా­య­క­త్వం­పై, ము­ఖ్యం­గా వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్‌­గా ఉన్న సో­ద­రు­డు కే­టీ­ఆ­ర్పై పరో­క్షం­గా వి­మ­ర్శ­లు గు­ప్పిం­చ­డం మొ­ద­లు­పె­ట్టా­రు.కొం­త­కా­లం తర్వాత పా­ర్టీ­లో­ని కీలక వ్య­క్తు­లు హరీ­ష్ రావు, సం­తో­ష్ రావు అవి­నీ­తి­కి పా­ల్ప­డ్డా­ర­ని సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. ని­జా­మా­బా­ద్ ఎం­పీ­గా తాను ఓడి­పో­వ­డా­ని­కి పా­ర్టీ­లో­ని కొ­న్ని శక్తు­లే కా­ర­ణ­మ­ని ఆరో­పిం­చా­రు. ఈ పరి­ణా­మాల మధ్య ఆమె బీ­ఆ­ర్ఎ­స్ నుం­చి సస్పె­న్ష­న్ ఎదు­ర్కొ­న్నా­రు, చి­వ­ర­కు పా­ర్టీ సభ్య­త్వా­ని­కి, ఎమ్మె­ల్సీ పద­వి­కి రా­జీ­నా­మా చే­శా­రు. దీం­తో కే­సీ­ఆ­ర్ వా­ర­స­త్వం­గా, బీ­ఆ­ర్ఎ­స్‌­ను ముం­దుం­డి నడి­పి­స్తు­న్న కే­టీ­ఆ­ర్‌­కు ఈ వి­భే­దా­లు వ్య­క్తి­గ­తం­గా, రా­జ­కీ­యం­గా తీ­వ్ర నష్టం కలి­గిం­చా­యి.

 ఆర్జేడీకి రోహిణి స్ట్రోక్: వైఫల్యమే కారణమా?

తా­జా­గా, బీ­హా­ర్ అసెం­బ్లీ ఎన్ని­కల ఫలి­తాల తర్వాత ఆర్జే­డీ అధి­నేత లాలూ ప్ర­సా­ద్ యా­ద­వ్ కూ­తు­రు రో­హి­ణి ఆచా­ర్య ఈ సి­స్ట­ర్ స్ట్రో­క్‌­ను బీ­హా­ర్‌­కు తీ­సు­కె­ళ్లా­రు. పా­ర్టీ ఓటమి తర్వాత, రా­జ­కీ­యాల నుం­చి తప్పు­కుం­టు­న్న­ట్లు, కు­టుం­బా­న్ని వదు­లు­కుం­టు­న్న­ట్లు సం­చ­లన ప్ర­క­టన చే­శా­రు.తన సో­ద­రు­డు, ఆర్జే­డీ­ని నడి­పి­స్తు­న్న తే­జ­స్వి యా­ద­వ్‌­కు సన్ని­హి­తు­లు అయిన సం­జ­య్ యా­ద­వ్, రమీ­జ్‌­లు తనను అవ­మా­నిం­చా­ర­ని, కొ­ట్టా­ర­ని కూడా ఆమె ఆరో­పిం­చ­డం ఆర్జే­డీ­లో చీ­లి­క­ను బహి­ర్గ­తం చే­సిం­ది. బీ­హా­ర్ రా­జ­కీ­యా­ల్లో క్రి­యా­శీ­లం­గా మా­రు­తు­న్న తే­జ­స్వి యా­ద­వ్ నా­య­క­త్వా­ని­కి, అతని పని­తీ­రు­కు రో­హి­ణి ఆరో­ప­ణ­లు ఒక పె­ద్ద దె­బ్బ­గా మా­రా­యి. పా­ర్టీ పరా­జ­యా­ని­కి బా­ధ్యత వహిం­చే అం­శం­పై కు­టుం­బం­లో­నే వి­భే­దా­లు తలె­త్తా­య­ని ఈ పరి­ణా­మం సూ­చి­స్తుం­ది.

Tags:    

Similar News