Sitaram Yechury: విషమంగానే సీతారాం ఏచూరి ఆరోగ్యం
వెంటిలేటర్‌పై చికిత్స..;
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా ఉంది. లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో సహా పలు అనారోగ్య సమస్యలో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీలో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆగస్టు 19న అనారోగ్యంతో ఆయన ఎయిమ్స్‌లో చేరారు. ఏచూరి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వైద్యుల బృందం ఏచూరి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. న్యూమోనియా కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఏచూరికి ఇటీవలే కాటరాక్ట్ సర్జరీ జరిగింది.
సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉందని, వామపక్ష ఉద్యమాలకు ఏచూరి ఒక ఐకాన్ అని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఏచూరి త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఎన్నో సమస్యలపై పోరాడిన ఏచూరి, ఇప్పుడు తన శరీరంతోనే పోరాడుతున్నారని అన్నారు. ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ఎలాంటి ప్రమాదం జరగకూడదని ప్రార్థిస్తున్నారు.