Maharashtra: ఎదురుతిరిగిన రెబెల్స్.. సీఎం ఏక్‌నాథ్ షిండేతో సమావేశం..
Maharashtra: శివసేన రెబల్ సిరీస్‌లో రెండో సీజన్ మొదలైంది. శివసేన తరపున గెలిచిన ఎంపీలు సైతం రెబల్‌గా మారారు.;
Maharashtra: శివసేన రెబల్ సిరీస్‌లో రెండో సీజన్ మొదలైంది. శివసేన తరపున గెలిచిన ఎంపీలు సైతం రెబల్‌గా మారారు. శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 12 మంది ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగరేశారు. ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేస్తున్న 12 మంది ఎంపీలతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సమావేశం అవుతున్నారు. ఇప్పటికే షిండే ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్‌లోనూ పార్టీ పక్షనేత, చీఫ్ విప్‌ను ఎన్నుకోనున్నారు రెబల్ ఎంపీలు.
షిండేతో సమావేశం అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను 12 మంది శివసేన ఎంపీలు కలవబోతున్నారు. సభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్‌ను కోరనున్నారు. మరోవైపు 12 మంది శివసేన రెబల్ ఎంపీలకు కేంద్రం వై-ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. ఇప్పటికే శివసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా షిండే ఎన్నికయ్యారు. పార్టీ విప్‌లను కూడా నియమించారు. ఇప్పుడు ఎంపీలను కూడా తన శిబిరంలోకి తీసుకుని.. శివసేన పార్టీ మొత్తం తనదేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.