Live in-Relationship: ప్రియుడు CRPF కానిస్టేబుల్, ప్రియురాలు ASI..

2021 నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం;

Update: 2025-07-20 05:30 GMT

ప్రేమవ్యవహారాలు, లివి ఇన్ రిలేషన్ షిప్స్ కారణంగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. ప్రియుడు సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్, ప్రియురాలు ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రియురాలి హత్యకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఒక మహిళా పోలీసు అధికారిణిని ఆమె ప్రియుడైన CRPF కానిస్టేబుల్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు దిలీప్ డాంగ్చియా, బాధితురాలు విధులు నిర్వహిస్తున్న అంజార్ పోలీస్ స్టేషన్‌ కి వెళ్లి లొంగిపోయాడు.

అరుణాబెన్ నతుభాయ్ జాదవ్ అనే ఆ మహిళ కచ్‌లోని అంజార్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI)గా పనిచేసింది. 25 ఏళ్ల అరుణాబెన్, ఆమె భాగస్వామి అంజార్‌లోని వారి ఇంట్లో గొడవ పడ్డారని, ఆ సమయంలో ఆమె అతని తల్లి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన దిలీప్ క్షణికావేశంతో అరుణాబెన్‌ను గొంతు నులిమి చంపేశాడని అంజార్ డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డివైఎస్పీ) ముఖేష్ చౌదరి తెలిపారు.

మణిపూర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో విధులు నిర్వహిస్తున్న నిందితుడికి అరుణతో చాలా కాలంగా సంబంధం ఉందని, ఇద్దరూ వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారు 2021 నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని, అప్పటి నుంచి కలిసి జీవిస్తున్నారు అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News