Sonia Gandhi: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం.. సోనియా గాంధీ సంచలన నిర్ణయం..

Sonia Gandhi: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది కాంగ్రెస్ పార్టీ.

Update: 2022-03-15 16:30 GMT

Sonia Gandhi (tv5news.in)

Sonia Gandhi: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ.. ఆయా రాష్ట్రాల్లో పార్టీప్రక్షాళన చర్యలు మొదలు పెట్టింది. ఎన్నికల్లో పార్టీ ప్రతినిధుల తీరుపై అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా ఐదురాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామాలు చేయాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు. పీసీసీలను పునర్ వ్యవస్థీకరించడంలో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ పీసీసీ అధ్యక్షుల రాజీనామాలు కోరారు.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌, గోవా, ఉత్తరాఖండ్‌లలో పార్టీ ఘోరంగా చతికిల పడింది. దీనిపై సమావేశమైన సీడబ్ల్యూసీ సుధీర్ఘంగా చర్చించింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా మరికొంతకాలం సోనియా గాంధీయే కొనసాగాలని నిర్ణయించింది. అలాగే, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపోటమిలకు కారణాలను సమీక్షించారు. ఐదురాష్ట్రాల ఓటమిపై తీసుకునే చర్యలను సైతం పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అప్పగించారు. 

Tags:    

Similar News