Sonia Gandhi : నేడు ఈడీ ముందు హాజరుకానున్న సోనియా..
Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.... ఇవాళ ఈడీ ముందు హాజరు కానున్నారు.;
Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసులో మరోసారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.... ఇవాళ ఈడీ ముందు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. గతనెలలోనే ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరుకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని దర్యాప్తు సంస్థకు తెలిపారు.
కొవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపిన సోనియా.. మూడు వారాల గడువు కోరారు. సోనియా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. అప్పటికి విచారణను వాయిదా వేశారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
మరోవైపు సోనియా ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఇవాళ హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
రాహుల్ విచారణ సమయంలోనూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి.సత్యాగ్రహ మార్చ్ పేరుతో ర్యాలీలు కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తంగా మారింది. దీంతో..ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు