ప్రయోజనాల కోసం ఆరు దశాబ్దాలుగా చేస్తున్న ఇస్రో మరో ముందడుగు వేసింది. ఇస్రోకు చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపుతోంది. నాసా, ఇస్రో భాగస్వామ్యంలో ఇస్రో వ్యోమగామిని అంతరిక్ష కేంద్రానికి పంపుతోంది. ఈనెల 29న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించే ఫాల్కన్ 9 స్పేస్ నౌకలో శుక్లా నింగిలోకి దూసుకెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 10:33 గంటలకు మరో ముగ్గురు సిబ్బందితో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకుంటారు.
ప్రధాన వ్యోమగామిగా శుభాన్షు శుక్లా
స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్9 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మూడో మానవ అంతరిక్ష ప్రయాణం. పోలాండ్, హంగేరీ నుంచి అంతరిక్షంలో బస చేసే మొదటి వ్యోమగాములను ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ తీసుకెళ్తోంది. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా గగన్‌యాన్ సిబ్బందిలో ఒకరు. ఆక్సియం మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాన్షు శుక్లా ISSలో 14 రోజులు పాటు గడపనున్నారు. ఆక్సియం మిషన్ 4 పైలట్‌గా శుక్లా వ్యవహరిస్తారు. మైక్రోగ్రావిటీ పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో శుక్లా అంతరిక్షంలో ఏడు ప్రయోగాలు చేయనున్నారు.