Sri Ram Piller: జగదభిరాముడి చరిత్రను తెలిపేలా..అయోధ్య నుంచి రామేశ్వరం వరకు శ్రీరామ స్తంభాలు
దేశంలో 290 చోట్ల ‘శ్రీరామ’ స్తంభాల నిర్మాణం;
శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు ఆయన ప్రాముఖ్యతను రాబోయే తరాలకు తెలియజేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం ఉత్తర్ప్రదేశ్లోనినికి సంబంధించి కీలక ప్రకటన చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దేశంలోని 290 ప్రాంతాల్లో శ్రీరాముడి రాతి స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వ్యయాన్ని అశోక్ సింఘాల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ భరిస్తుందని వెల్లడించారు. వీటి నిర్మాణంలో ప్రభుత్వానికి చెందిన ఒక్క రూపాయిని కూడా వాడబోమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో శ్రీరాముడు వనవాస సమయంలో అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ప్రయాణించిన మార్గంలో ‘శ్రీరామ స్తంభాలు’ ప్రతిష్ఠించేందుకు ‘అశోక్ సింఘాల్ ఫౌండేషన్’ 290 స్థలాలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో దశల వారీగా స్తంభాలు ఏర్పాటు చేస్తామని హిందూ మున్నని వర్గాలు తెలిపాయి. మొదటి స్తంభాన్ని అయోధ్యలోని మణిపర్వంలో ప్రతిష్ఠించారు. చివరి స్తంభాన్ని రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి అరిచ్చల్‌మునైలో ఏర్పాటు చేస్తారు.
ఈ స్తంభాల ద్వారా శ్రీరాముడి చరిత్రతోపాటు ఆయన ప్రాముఖ్యత రానున్న తరాలకు తెలుస్తుందని చంపత్ రాయ్ అన్నారు. వీటిని ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఉన్న స్థల పురాణం లాంటి వివరాలను కూడా స్థానిక భాషలోనే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండేలా చూస్తామని వెల్లడించారు. అశోక్ సింఘాల్ ఫౌండేషన్ పేరుతో దిల్లీలో ఉన్న ఓ ట్రస్ట్ … శ్రీరాముడి జీవితం, ఆయన విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా వాటి వివరాలను రాతి స్తంభాలపై చెక్కి దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో స్థాపించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ స్తూపాలు దుమ్ము, వర్షం, నాచు పట్టడం వంటి వాటిని తట్టుకునే విధంగా తయారు చేయించారు.
మరోవైపు అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో గ్రౌండ్ ఫ్లోర్ పనులను పూర్తి చేయాలని ట్రస్టు నిర్దేశించింది. స్తంభాలపై శిల్పాలపై చెక్కే పని జరుగుతోంది. ఈ చిత్రాలను చూడి రామ భక్లులు పులకరించి పోతున్నారు. రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో సుమారు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ దేవుళ్ల ప్రతిమలు కనిపిస్తున్నాయి. స్తంభంపై చెక్కిన దేవుళ్లు, దేవతల విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి.నాగర్ శైలిలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ వైభవాన్ని దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన శిల్పాలు చెక్కుతున్నారు. రామ మందిరానికి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇప్పటికే ఆలయ గోపురం పూర్తయింది. ఆలయంలో నాలుగు గోపురాలు నిర్మించారు.వచ్చే ఏడాది జనవరిలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 22న మొదట పూజలు చేస్తారు. దీంతో అయోధ్య రామ మందిరానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.