Rahul Gandhi : రాహుల్‌ను కాపాడుతున్నది మోడీనే.. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ

Update: 2024-08-12 06:30 GMT

లోక్ సభలో విపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో ( Rahul Gandhi ) పాటు ప్రధాని మోడీపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరసత్వం కేసులో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమితా కాపాడుతున్నారని ఆరోపించారు.

రాహుల్ ను రక్షిస్తున్న మోదీ, అమిత్ షాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సుబ్రమణ్య స్వామి హెచ్చరించారు. రాహుల్ గాంధీ 2003 సంవత్సరంలో బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నారని, బ్యాక్అప్స్ అనే కంపెనీని కూడా లండన్ లో ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. అందువల్ల ఆయన భారతీయ పౌరసత్వం చెల్లదని ఆరోపించారు.

రాహుల్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మోదీ, షాలను స్వామి ఎక్స్ పోస్ట్ లో సుబ్రహ్మణ్య స్వామి నిలదీశారు. ఈ అంశంపై తాను 2019లో విదేశాంగ శాఖకు చేసిన ఫిర్యాదు కాపీని ఈ పోస్ట్ తోపాటు జత చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి నోటీసు ఇచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News