Gulam Nabi Azad : కశ్మీర్‌లో గులాంనబీ ఆజాద్‌కు పెరుగుతున్న మద్దతు..
Gulam Nabi Azad : ఆజాద్‌కు మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ పార్టీకి రాజీనామా చేశారు.;
Gulam Nabi Azad : కశ్మీర్‌లో గులాం నబీ ఆజాద్‌కు మద్ధతు పెరుగుతోంది. కశ్మీర్ కాంగ్రెస్ నేతలు సామూహికంగా రాజీనామా చేస్తున్నారు. ఆజాద్‌కు మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ పార్టీకి రాజీనామా చేశారు. కశ్మీర్‌కు చెందిన మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వాని, మనోహర్ లాల్ శర్మ, ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ కూడా ఆజాద్‌కు జై కొడుతున్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఆజాద్ ప్రకటించడంతో స్థానిక నేతలు ఉత్సాహంతో ఉన్నారు. కార్పొరేటర్లు, జిల్లా, బ్లాక్ లెవల్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడి ఆజాద్‌తో చేతులు కలిపారు.