Nupur Sharma: నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట..
Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన నుపూర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.;
Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఆగష్టు 10 వరకు నుపుర్ శర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు తెలిపింది. నుపుర్ శర్మకు ప్రాణహాని కూడా ఉందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ ఆగష్టు 10కి వాయిదా వేసింది. తన అరెస్టులపై స్టే విధించాలంటూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నుపూర్ శర్మపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. తన జీవితం ప్రమాదంలో పడిందని.. హత్య, అత్యాచారం బెదిరింపులు వస్తున్నాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో నుపూర్ శర్మ తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున దేశంలో వివిధ ప్రాంతాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఓ టీవీ ఛానల్ చర్చ కార్యక్రమంలో భాగంగా నుపుర్ శర్మ.. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.