Supreme Court : సుప్రీంకోర్టు సంచలనం.. 25000 టీచర్ల పోస్టులు రద్దు

Update: 2025-04-03 15:15 GMT

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2016లో జరిగిన 25 వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. ఆ తీర్పును SC సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించారు. నియామకాలు రద్దైన ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఇప్పటివరకు అందుకున్న జీతభత్యాలను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. మానవీయ కోణంలో ఆలోచించి ఆ నియామకాల ద్వారా కొలువులు సాధించిన దివ్యాంగులు యథావిథంగా తమ ఉద్యోగాలు చేసుకోవచ్చని తీర్పునిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి టీచర్‌ సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

Tags:    

Similar News