Arvind Kejriwal : సుప్రీంలో కేజ్రీవాల్ కు ఊరట.. విడుదలకు తొలగిన అడ్డంకులు

Update: 2024-09-13 09:00 GMT

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌‌కు సుప్రీం కోర్టులో ఉరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అయితే తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం కోర్టు వెలువరించింది.

కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మద్యం పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు లేదని, ఆయనకు బెయిల్‌ మంజూరుచేయాలని వాదించారు. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల కానున్నారు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. మధ్యం పాలసీ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని ఆదేశించింది. 10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీతో సంతకాలు ఉండాలని తెలిపింది. అలాగే, ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

Tags:    

Similar News