Varanasi: మజీదులో శివలింగం సర్వేపై స్టే ఇవ్వడం కుదరదన్న సుప్రీంకోర్టు..
Varanasi: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే అంశంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.;
Varanasi: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే అంశంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.. అయితే, సర్వేపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.. మసీదు ప్రాంతంలో శివలింగం బయటపడితే ఆ ప్రాంతాన్ని జిల్లా మెజిస్ట్రేట్ పరిరక్షించాలని సూచించింది..
అన్ని వర్గాల మధ్య సమతుల్యత పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.. ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి అంతరాయం కలిగించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. జ్ఞానవాపి మసీదులో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వేలో అక్కడి బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందన్న వార్త సర్వత్రా చర్చనీయాంశం అయింది..
మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతా మూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహిళలు వేసిన పిటిషన్‌పై వారణాసి కోర్టు విచారణ చేపట్టగా.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అక్కడ శనివారం నుంచి సర్వే పనులు జరుగుతున్నాయి.. ఈ వార్త తెలియగానే సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.. ఆ ప్రాంతాన్ని తమ నీయంత్రణలోకి తీసుకున్నాయి.. అయితే, అక్కడ కనిపించింది శివలింగం కాదని, ఫౌంటెయిన్‌లో భాగమని మరోపక్షం వాదిస్తోంది.