పరువునష్టం కేసు ప్రొసీడింగ్స్‌ను నిలిపేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 2018 నాటి కాంగ్రెస్ ప్లీనరీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘హత్యకేసులో నిందితుడు’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో ఆయనపై బీజేపీ నేత నవీన్ ఝా దావా వేశారు. పరువు నష్టం కేసులో సంబంధిత వ్యక్తి వేయాలని, వారి కార్యకర్తలు లేదా ఇతరులు వేయడం కాదని గతంలో జార్ఖండ్ కోర్టులో రాహుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సింఘ్వీ వాదనలపై స్పందించాలనినవీన్ ఝా, జార్ఖండ్ ప్రభుత్వానికి నాలుగు రోజుల సమయం ఇచ్చింది జార్ఖండ్ కోర్టు. కేసుపై మరింత పరిశీలన అవసరమని నేడు సుప్రీంకోర్టు పేర్కొంది.ఈ కేసులో సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ, ఫిర్యాదుదారు మరియు జార్ఖండ్ ప్రభుత్వం సమాధానం ఇచ్చే వరకు తదుపరి విచారణ నిలిచిపోయింది. రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదులు వాదించిన ప్రకారం, ఈ కేసు చట్టపరమైన ప్రమాణాలను పాటించలేదని భావిస్తున్నారు. తదుపరి విచారణలో ఈ అంశంపై నిర్ణయం వెలువడనుంది.