NEET PG 2022: నీట్‌ పీజీ సీట్ల భర్తీ.. ఐఎంఏ, కేంద్ర వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

NEET PG 2022: నీట్‌ పీజీ సీట్ల భర్తీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కేంద్ర వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Update: 2022-06-08 09:30 GMT

NEET PG 2022: నీట్‌ పీజీ సీట్ల భర్తీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కేంద్ర వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటాలో ఉన్న 14వందల 56 సీట్లు ఖాళీగా ఉండడంపై ధర్మాసనం ఆగ్రహించింది. విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. సీట్లు ఖాళీగా ఉంచి ఏం సాధించారని ప్రశ్నించింది. వైద్య శాఖ డీజీని కోర్టుకు పిలిపించి తామే ఆర్డర్స్‌ పాస్ చేస్తామని తెలిపింది. పీజీ సీట్ల భర్తీ, ఖాళీలపై ఇవాళే అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.

Tags:    

Similar News