Supreme Court : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

Update: 2025-04-02 13:15 GMT

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రయాగ్ రాజ్ లో 2021లో కూల్చిన ఒక్కో ఇంటికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2021 లో ప్రయాగ్ రాజ్ లోని ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్ తో పాటు మరో ముగ్గురి ఇళ్లను ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు కూల్చివేశారు. ఆశ్రయం పొందే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమ ని అధికారులు గుర్తించుకోవాలంది. దేశంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ చురకలు అంటించింది. ఇండ్ల కూల్చివేత రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమానవీయ చర్య అని అభివర్ణించింది. ఈ కేసును జస్టిస్ ఓకా, ఉజ్జల్ భూయన్ తో కూడిన ధర్మాసనం విచారించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక న్యాయవా ది, ఒక ప్రొఫెసర్, మరికొందరి ఇళ్లను రాత్రికి నోటీసులు జారీ చేసి తెల్లారి కూల్చివేసిందని పేర్కొంటూ న్యాయ వాది జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మద్ ఇండ్లు కూల్చివేసిన మరో ముగ్గురు కోర్టుకు తెలిపారు. 2023లో పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కు చెందిన భూమిగా అధికారులు భావించి అందులోని కట్టడాలను కూల్చివేశారు. వాస్తవానికి అది తమదని పేర్కొంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. “కూల్చివేతలు అమానవీయం. చట్టవిరుద్ధం. దేశంలో రూల్ ఆఫ్ లా ఒకటి ఉంది. ఈ తరహాలో నివాస భవనాల కూల్చివేత ఒక ఫ్యాషన్ కాకూడదు. బాధితులకు ఆరువారాల్లో రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి" అని ప్రయా గ్రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించిన ప్రయాగ్రాజ్ చట్టాన్ని గౌరవించకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని గతంలోనూ సుప్రీం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇది సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతోంద నిఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News