పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దిగువ కోర్టులు పత్రాల సంఖ్య చూశాయేగానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది.
పరువునష్టం కేసులో.. సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్ని అలహాదాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు రాహుల్. అక్కడ సూరత్ కోర్టు తీర్పు సమర్ధించడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాహుల్ పై విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది. సూరత్ కోర్టు తీర్పుతో మార్చి 24న రాహుల్ పై అనర్హత వేటు వేసింది లోక్ సభ. తాజా తీర్పుతో ఆయన తిరిగి లోక్ సభ సభ్యత్వం వచ్చినట్లైంది.