Supreme Court : కావడి యాత్ర వెంబడి బోర్డులపై సుప్రీంకోర్టు స్టే

Update: 2024-07-22 17:05 GMT

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లో కావడియాత్ర కండిషన్లు దుమారం రేపుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. కావడి యాత్ర మార్గంలో ఉండే హోటళ్లు, ధాబాలు, తోపుడు బండ్లపై యజమానుల పేర్లను ప్రదర్శించాలన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

ఇటీవల అధికారుల ఆదేశాలతో కన్వర్ యాత్ర సాగే మార్గం పొడవునా దుకాణాల బోర్డులపై యజమానులు తమ షాపు పేర్లను పెద్ద అక్షరాలతో రాయడం మొదలుపెట్టారు. ఇది కొంత కాంట్రవర్సీ అయింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. వీటి మీద స్పందించాలంటూ ఆయా రాష్ట్రాలకు నోటీసులు పంపింది. దుకాణాల మీద యజమానుల పేర్లు, సిబ్బంది పేర్లను రాయాలని ఆహార విక్రయదారులను ఒత్తిడి చేయకూడదని ఆదేశించింది.

తదుపరి విచారణను జులై 26కు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ నేమ్‌ప్లేట్స్‌ కు సంబంధించి యూపీలోని ముజఫర్‌నగర్ పోలీసులు ఇచ్చిన ఆదేశాలు వివాదానికి దారి తీశాయి.

Tags:    

Similar News