అతనే సుశాంత్‌కి డ్రగ్స్ తీసుకోవడం నేర్పించాడు : రియా చక్రవర్తి
తీవ్ర కలకలం రేపిన సుశాంత్ సూసైడ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది..ప్రస్తుతం 14 రోజుల కస్టడీలో ఉన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో..;
తీవ్ర కలకలం రేపిన సుశాంత్ సూసైడ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది..ప్రస్తుతం 14 రోజుల కస్టడీలో ఉన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో-NCBకి కొత్త విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలోని పేరుపొందిన ఫిల్మ్‌మేకర్ సుశాంత్‌కి డ్రగ్స్ తీసుకోవడం నేర్పించాడని తరచూ డ్రగ్స్ పార్టీలకు కూడా తీసుకువెళ్తుండేవాడని... ఓరోజు సుశాంతే తనకి ఈ విషయాన్ని చెప్పాడని రియా పేర్కొన్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు సుశాంత్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో బీటౌన్‌కి చెందిన అతని స్నేహితులు డ్రగ్ పార్టీలు చేసుకునే వారని చెప్పినట్లు సమాచారం. దీంతో మహారాష్ట్ర పోలీసులు సదరు ఫిల్మ్‌మేకర్‌పై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర, గోవాల్లోని చాలా ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..
బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో NCB కీలక స్టేట్మెంట్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి, పలువురు ప్రముఖుల పేర్లను బయటపెట్టిందని ప్రచారం జరిగింది. సారా అలీఖాన్‌తో పాటు రకుల్ ప్రీత్‌సింగ్, ఇలా 25 మంది ప్రముఖుల పేర్లు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ లిస్టు ఆధారంగా ఎన్సీబీ విచారణ మొదలు పెట్టిందన్నారు. ఈ ప్రచారం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ కలకలం రేపింది. ఒక్కసారిగా యావత్ సినీ ప్రపంచం వణికిపోయింది. అయితే ఇప్పుడు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా పేరిట తాజా ప్రకటన వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటులతో జాబితాను సిద్ధం చేయలేదని కేపీఎస్ మల్హోత్రా స్పష్టం చేశారు. అంతేకాదు రియా కూడా ఎవరి పేర్లు చెప్పలేదని తెలిపారు.. కేవలం డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లు, ట్రాఫికర్లతో మాత్రమే లిస్టును రూపొందించామని, దీన్నే బాలీవుడ్ లిస్టుగా పొరపడ్డారేమోనని NCB అధికారులు చెప్పారు. అసలు బాలీవుడ్ పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.