Taj Mahal: తాజ్ మహల్ సరికొత్త ఘనత.. ప్రపంచంలోనే నెంబర్ 1..
Taj Mahal: ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;
Taj Mahal: ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా తాజ్‌మహల్ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. అత్యుత్తమైన స్మారక కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్.. ఎక్కువ మంది గూగుల్ సర్చ్ చేసిన ప్రాంతంగా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ వెబ్‌సైట్ జిటాంగో పరిశోధనలు జరిపింది.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, బిగ్ బెన్, లండన్ ఐ, స్టోన్ హెంజ్ వంటి ఇతర స్మారక చిహ్నాలను వెనక్కి నెట్టి తాజ్‌మహల్ మొదటి స్థానంలో నిలిచినట్లు ట్రావెల్ వెబ్‌సైట్ జిటాంగో సంస్థ తెలిపింది. గూగుల్ కీవర్డ్ ప్లానర్ ద్వారా దీనిని గుర్తించినట్లు వెల్లడించింది. ఒకే నెలలో దాదాపు 14 లక్షలకు పైగా ఈ అపురూప కట్టడం గురించి ఆన్‌లైన్‌లో వెతికారు.
తాజ్‌మహల్ తర్వాత పెరూ దేశంలోని మాచు పిచ్చు 12 లక్షల శోధనలతో రెండో స్థానంలో నిలిచింది. యుఏఈలో ఉన్న బుర్జ్ ఖలీఫా 11 లక్షల సెర్చ్‌లతో మూడవ స్థానం దక్కించుకుంది. యూఎస్ఏ, కెనడా సరిహద్దులోని నయాగరా జలపాతం 9 లక్షల శోధనలతో నాల్గవ స్థానంలో నిలిచింది.
అలాగే ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ టవర్ ఐదవ స్థానం, నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్ట్ 7వ స్థానం, అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ 8వ స్థానం, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 27వ స్థానం, మౌంట్ ఫుజి 35వ స్థానం, వాటికన్ సిటీలోని అందమైన సిస్టైన్ చాపెల్ 50వ స్థానాలు దక్కించుకున్నాయి. ఇక ఇంగ్లాండ్‌లోని విల్ట్‌షైర్‌లోని బ్రిటన్ సాంస్కృతిక చిహ్నం స్టోన్‌హెంజ్ గురించి 79 వేలకు పైగా ఆన్‌లైన్‌లో వెతికినట్లు ట్రావెల్ వెబ్‌సైట్ జిటాంగో సంస్థ తెలిపింది.