Chenab Railway Bridge : జమ్ము కశ్మీర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్.. ఈ రోజే ప్రారంభం..

Chenab Railway Bridge : జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వేబ్రిడ్జి ఈరోజు ప్రారంభం కానుంది.

Update: 2022-08-13 07:01 GMT

Chenab Railway Bridge : జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వేబ్రిడ్జి ఈరోజు ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అంత్యంత ఎత్తైన రైల్వేబ్రిడ్జిపనులు ముగియడంతో లాంచనంగా ప్రారంభించనున్నారు. 476 మీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తులో విల్లు ఆకారంలో నిర్మించిన రైల్వేబ్రిడ్జి.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. ఈ రైల్వే వంతెన ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఇది ఉద్ధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు కింద ఇది చాలా కీలకమైనది. కత్రా- బనిహాల్ మధ్య ఈ వంతెనను నిర్మించారు.

దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది. 2002లో ఈ బ్రిడ్జి్ నిర్మాణ పనులు ప్రారంభమైనా.. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా నిలిచిపోయాయి. మళ్లీ 2017 నవంబర్‌లో మెయిన్ ఆర్చ్ పనులు ప్రారంభమయ్యాయి. 2019 చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు భావించినా.. కాంట్రాక్టు సమస్యల కారణంగా జాప్యం జరిగింది. కరోనా​ వల్ల మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్దమైంది. 

Tags:    

Similar News